హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలపై పోలీసులకు ఫిర్యాదు

యాదగిరిగుట్ట మాడవీధుల్లో సంకల్పం చేయడంపై ఆలయ ఈవో అభ్యంతరం

హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలపై పోలీసులకు ఫిర్యాదు
X

మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులపై యాదగిరిగుట్ట ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదగిరిగుట్ట ఆలయ మాడవీధుల్లో హరీశ్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత సహా మరికొందరు సంకల్పం చేశారని, ఇలా సంకల్పం చేయడానికి ఎలాంటి అనుమతి లేదని యాదగిరిగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఈవో భాస్కర్ రావు పేర్కొన్నారు. సెక్షన్ 7 రిలీజియస్ యాక్ట్ 1988 ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హరీశ్ రావు, ఇతర నాయకుల చర్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంద్రాగస్టు లోపు రూ.2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామని యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా ఒట్టువేసిన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని, పాలకుడు మాట తప్పితే దానికి ప్రజలను శిక్షించద్దని లక్ష్మీనర్సింహస్వామిని వేడుకుంటూ హరీశ్ రావు ఇతర నేతలు గురువారం సంకల్పం చేశారు. మాడ విధుల్లో ఇలా సంకల్పం చేయడంపై ఈవో అభ్యంతరం తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.





Next Story