ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత పెరిగింది : వైఎస్‌ జగన్‌

కేవలం ఆధిపత్యం చాటడం కోసం ఒక పథకం ప్రకారం నవాబ్‌పేట్‌ దాడి ఘటన జరిగిందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు.

YS Jagan
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ అన్నారు. దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలిద్దరినీ మంగళవారం విజయవాడ ఆస్పత్రిలో జగన్‌ పరామర్శించారు. నవాబ్‌పేటలో పక్క ప్రణాళిక ప్రకారం కర్రలతో కొట్టారని సుమారు 20 మంది కలిసి దాడి చేశారు. ఇలాంటి ఘటనలతో సీఎం చంద్రబాబు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు అదుపు తప్పిందన్నారు.

చివరకు.. మహిళలు, చిన్నారులపైనా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తున్నారు. దాడులు ఆపాలని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామస్థాయి నుంచి భయానక పరిస్థితి సృష్టించారని పాలన పోకస్ పెట్టకుండా దాడులకు పాల్పడుతున్నరని ఆయన అన్నారు. ఇంత వరుకు బాబు ఏం చేస్తున్నారు. అన్నదాతకు పెట్టుబడి సాయం, అమ్మఒడి, వసతి దీవెన నిధులు ఇప్పటికీ అందలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గల ప్రజలను మోసం చేశారని మాజీ సీఎం అన్నారు. ఈ విషయన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story