బీజేపీపై ఒవైసీ షాకింగ్ కామెంట్స్..కమలం పార్టీ ముస్లింలకు శత్రువు

పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. లోక్ సభలో ఈ రోజు వక్ఫ్ బోర్డు బిల్లుపై చర్చ సందర్బంగా హైదరాబాద్ ఎంపీ, అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర సర్కార్‌పై మండిపడ్డారు.

Owiasi
X

బీజేపీపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కార్ ముస్లింలకు శత్రువు అనడానికి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఉదహరణ అని ఒవైసీ అన్నారు. ఇది రాజ్యంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తోంది. ఆలయ కమీటిల్లో హిందూయేతరలు లేనప్పుడు వక్ఫ్ బోర్డు ఆస్తిలో వారి అవసరం ఏంటి అని ప్రశ్నించారు. మైనర్టీలను టార్గట్ చేసుకోని వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే.. ఈ ప్రభుత్వం దేశంలో మైనారిటీ వర్గాలైన ముస్లింలనే కాకుండా సిక్కులను, క్రిస్టియన్లను కూడా వేధిస్తోందని ఒవైసీ సంచలన వాఖ్యలు చేశారు.

కాగా.. ఈ బిల్లుపై యూపీ సహరాన్ పూర్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు . ఈ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధం .. వక్ఫ్ బోర్డు అనేది ఒక సంస్థని , అది మతపరమైన స్థలం కాదని కేంద్రం వాదిస్తోంది .. కానీ ఇది తప్పు ఎందుకంటె వక్ఫ్ బోర్డు అనేది దేశవ్యాప్తంగా ఉన్న దర్గాలు , మసీదులను పర్యేవేక్షిస్తుందని మసూద్ పార్లమెంట్ లో తెలిపారు. తమ ఆస్తులను తాము చూసుకుంటామని , ముస్లిం మతపరమైన వ్యవహారాల నుంచి వక్ఫ్ బోర్డుని వేరు చేయలేమని మసూద్ కామెంట్స్ చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story