ఇందిరమ్మ రాజ్యం కాదు..రేవంత్ కుటుంబ పాలన నడుస్తోంది : బాల్క సుమన్

ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ కుటుంబ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సీఎం సోదరులకు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

balk suman
X

ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ కుటుంబ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సీఎం సోదరులకు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమెరికా పర్యటనలో స్వచ్ బయోతో రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందన్నారు. అయితే ఆ కంపెనీ రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల జగదీశ్ రెడ్డిదని చెప్పారు. 15 రోజుల క్రితమే ఆ కంపెనీ ఏర్పాటు అయ్యిందన్నారు. ఈ సంస్థల ద్వారానే రేవంత్ రెడ్డి బ్లాక్ మనీని వైట్ గా మారుస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాన కంపెనీలే కాకుండా రేవంత్ సోదరులు అనేక మైక్రో సంస్థల్లో డైరెక్టర్లు గా ఉన్నారని అన్నారు.

సాక్షాత్తూ శాసన సభ కమిటీ హల్ లో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదా లేకున్నా అసెంబ్లీ స్పీకర్ దగ్గర వికారాబాద్ రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారని నిలదీశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏ అర్హతతో కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణి చేశారని అడ్డుకున్నా అధికారులు కూడా పట్టించుకోలేదన్నారు. రేవంత్ రెడ్డి మరో సోదరుడు కొండల్ రెడ్డి అలాగే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ హోదా ఉందని అధికారులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటన చూస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కొండల్ రెడ్డికి పదుల సంఖ్యలో కాన్వాయ్ లు వాహనాలు ఉంటాయని, అధికారులు రాచమర్యాదలు చేస్తారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సోదరులు రియల్టర్లను బెదిరించి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. తెలంగాణలో ఇపుడు నడుస్తోంది ఇందిరమ్మ రాజ్యం కాదని రేవంత్, ఆయన సోదరుల సామ్రాజ్యం మని విమర్శించారు.

తెలంగాణ మేధావులు రేవంత్ సోదరుల ఆగడాలపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అధికార దర్పం ,అవినీతిపై తెలంగాణ సమాజం ఆలోచించాలని సూచిచాంరు. డొల్ల కంపెనీలతో పెట్టుబడులు పెట్టిస్తే తెలంగాణ పరువు ఏమవుతుందని ప్రశ్నించారు.రేవంత్ సోదరులు రియల్టర్లను బెదిరించి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. తెలంగాణలో ఇపుడు నడుస్తోంది ఇందిరమ్మ రాజ్యం కాదని రేవంత్, ఆయన సోదరుల సామ్రాజ్యం మని విమర్శించారు. తెలంగాణ మేధావులు రేవంత్ సోదరుల ఆగడాలపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అధికార దర్పం ,అవినీతిపై తెలంగాణ సమాజం ఆలోచించాలని సూచిచాంరు. డొల్ల కంపెనీలతో పెట్టుబడులు పెట్టిస్తే తెలంగాణ పరువు ఏమవుతుందని ప్రశ్నించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story