ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుంది : జగదీష్‌రెడ్డి

రేవంత్‌ సర్కార్ 9 నెలల పాలనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. రైతుల మాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగటి దొంగలా దొరికిందని ఆరోపించారు.

Jagadish reddy
X

రేవంత్‌ సర్కార్ 9 నెలల పాలనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. రైతుల మాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగటి దొంగలా దొరికిందని ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పైళ్లా శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్‌తో కలిసి మాట్లాడారు. 17 లక్షల 13 వేల మందికి రుణ మాఫీ చేయలేదని స్వయంగా మంత్రి ఉత్తమ్ ఒప్పుకున్నారు. రూ.31 వేల కోట్లు పూర్తిగా చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇది ఏ తేదీలోపు చేస్తారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రుణ మాఫీ పూర్తయిందని డ్యాన్సులు చేస్తు న్నారు. మంత్రులు మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం చెప్పింది అబద్ధమని ఉత్తమ్ మాట లతో అర్దమవుతున్నది. ఇప్పుడు రేవంత్‌ రెడ్డిముక్కు నేలకు రాసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? చెంపలు వేసుకుంటావా? అని జగదీష్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

మీరు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ మాత్రం రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న మా డిమాండ్ పై సీఎం రేవంత్ తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణ సోయి, ఆత్మ లేని వ్యక్తులు సచివాలయంలో ఉండటం ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా మేము అధికారం లోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్నారు. రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్‌లో లేదంటే రేవంత్ తన ఇంట్లోనో పెట్టుకోవాలని సూచించారు . గౌరవప్రదమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి తెలంగాణ తల్లిపై చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధమని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ నోటి నుంచి ఒక్కసారైనా తెలంగాణ పదం ఉచ్ఛరించారా? ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణకు ఏమి ఇచ్చారని నిలదీశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టాలని ప్రొఫెసర్ హరగోపాల్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. తెలంగాణ తల్లి విగ్రహంపై కోదండ రామ్ స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story