ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైన కూలిపోవచ్చు : ఖర్గే

ఇది మైనార్టీ సర్కార్ ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉంది

Mallikarujan kharge Aicc
X

కాంగ్రెస్ జాతీయ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడేన కూలిపోవచ్చుని ఆయన తెలిపారు. ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘ఎన్డీయే ప్రభుత్వం అనుకోకుండా ఏర్పడింది. ప్రధాని మోదీకి మెజారిటీ లేదాన్నారు. ఇది మైనారిటీ ప్రభుత్వం. కాబట్టి ఎప్పుడైనా పడిపోవచ్చు. కానీ నేను ఇది కొనసాగాలని కోరుకుంటున్నా అని తెలిపారు.

భారత దేశాన్ని బలోపేతం చేయడానికి కలిసి పని చేయాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. దేశాభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తామని చెప్పారు. బీజేపీ మిత్ర పక్షాలు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నాయని, కేంద్ర కేబినెట్ ఏర్పాటు తర్వాత ఈ విషయం స్పష్టంగా అర్థమైందన్నారు. దేశం బాగు కోసం మేం ఎలాంటి నిర్ణయాలైన తీసుకునేందుకు సిద్దంగా ఉన్నామని ఖర్గే తెలిపారు.

Vamshi

Vamshi

Writer
    Next Story