సీఎం రేవంత్‌రెడ్డితో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి భేటీ
సీఎం రేవంత్‌రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి భేటీ అయ్యారు
- By VamshiLoading...
- | 8 July 2024 6:43 AM GMT
X
X
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ ఇంటికి వెళ్లారు. గత రెండు రోజుల నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం పార్టీలోకి చేరబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల మధ్య ఎమ్మెల్సీ చల్లా, సీఎంని కలవడంతో పార్టీ మార్పు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మంగళవారం సీఎం ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని టాక్
Vamshi
Writer
Next Story