సీఎంతో మాల ఎమ్మెల్యేలు, మాలమహానాడు నాయకుల భేటీ

వర్గీకరణ అమలులో తమకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి

సీఎంతో మాల ఎమ్మెల్యేలు, మాలమహానాడు నాయకుల భేటీ
X

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాల ఎమ్మెల్యేలు, మాల మహానాడు నాయకులు భేటీ అయ్యారు. సోమవారం రాత్రి సెక్రటేరియట్ లో సీఎంతో సమావేశమై.. వర్గీకరణ అమలులో తమకు అన్యాయం చేయవద్దని కోరారు. గతంలో చంద్రబాబు చేసిన పొరపాట్లు రిపీట్ కానివ్వద్దని విజ్ఞప్తి చేశారు. మాదిగల జనాభా ఎక్కువ అన్న ప్రచారాన్ని కూడా నమ్మవద్దన్నారు. ఎస్సీల్లోని జనాభాను లెక్కించాలని, వారి ఆర్థిక, సామాజిక అంశాలకు సంబంధించిన వివరాలు శాస్త్రీయంగా సేకరించిన తర్వాతే ఈ అంశంలో ముందుకెళ్లాలని సూచించారు. కేబినెట్ సబ్ కమిటీలో ఎస్సీలు వద్దని, ఇతరులతో ఏర్పాటు చేయాలని కోరారు. మాలల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. సుప్రీం కోర్టు ఇచ్చిన 565 పేజీల సుదీర్ఘ తీర్పులో ఎక్కడా వర్గీకరణ అమలు చేయాలని చెప్పలేదన్నారు. మాలమాదిగల అంశం చాలా సున్నితమైనదని.. వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వివేక్, నాగరాజు, రాగమయి, వంశీకృష్ణ, వర్గీకరణ వ్యతిరేఖ పోరాట సమితి కన్వీనర్ సర్వయ్య, కో కన్వీనర్ లు జి. చెన్నయ్య, పిల్లి సుధాకర్, చెరుకు రాంచందర్, దాదా దిగంబర్ కాంబ్లే, బత్తుల రాంప్రసాద్, ఆవుల సుధీర్, జంగ శ్రీనివాస్, తాళ్లపల్లి రవి, బూర్గుల వెంకటేశ్వర్లు, పిల్లి బాలరాజు, హుస్సేన్, మన్నె శ్రీరంగ, రమేష్, కనకరాజు, మంత్రి నర్సింహ, దుర్గం నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story