మండలిలో బీఆర్‌ఎస్ ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి

శాసన మండలిలో బీఆర్‌ఎస్ ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారిని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నియమించారు.

మండలిలో బీఆర్‌ఎస్ ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి
X

శాసన మండలిలో బీఆర్‌ఎస్ ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారిని నియమించారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన శాసన సభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పలువురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో ఆయనను మండలి ప్రతిపక్ష నేతగా ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ సమక్షంలో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు.

బస్వరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్‌రావు, దయానంద్, ఎగ్గే మల్లేష్.. ఈ ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరారు. తాజా చేరికలతో మండలిలో 12కి పెరిగింది కాంగ్రెస్‌ బలం. తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య 40 అయితే.. ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా 38మందిలో కాంగ్రెస్‌కు నిజానికి నలుగురు మాత్రమే ఉన్నారు. మిగతా 8మంది బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చినవాళ్లే. ఇక బీజేపీకి ఒకరు, ఎంఐఎంకు ఒక ఎమ్మెల్సీ ఉండగా.. ఇద్దరు ఇండిపెండెంట్స్‌ ఉన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story