రైతుల అందరికి రుణమాఫీ వర్తింప చేయాలి : మాజీ మంత్రి సింగిరెడ్డి

రూ.2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేయాలి

Singireddy
X

రుణమాఫీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ డేటాను పరిగణనలోకి తీసుకోవడం సరికాదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రుణమాఫీ అందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో తొలిసారి కేసీఆర్ రైతుబంధు పథకం అమలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి పెరిగి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు 70 లక్షల మంది రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎకరాకు రూ.5 వేలు, ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు రైతుబంధు పథకాన్ని వర్తింపచేశామని సింగిరెడ్డి అన్నారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రాతిపదికగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 70 లక్షల పైచిలుకు రైతాంగంలో సగానికి సగం మంది రైతులకు పథకాలను ఎగ్గొట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నదని అన్నారు.సీఎం రేవంత్ అదికారంలోకి రాగానే డిసెంబరు 9వ తేదీన రూ.15 వేలు రైతుభరోసా ఇస్తామని.. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాయమాటలు చెప్పారని ఆయన తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రుణమాఫీ, రైతుభరోసా అందరికీ అమలు చేయాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story