బీఆర్‌ఎస్ భవనాలను ట‌చ్ చేయండి చూద్దాం : పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వన్నికి దమ్ముంటే జిల్లాల్లో ఉన్న బీఆర్‌ఎస్ భవనాలు టచ్ చేసి చూడండని సవాల్ విసిరారు

Piddi sudhshan reddy
X

కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ కార్యాల‌యాల‌ను ట‌చ్ చేస్తే గులాబీ ద‌ళం చేతులు ముడుచుకోని కూర్చోద‌ని అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణం భవన్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యాల‌యాల‌ను కూల్చుతామంటే 60 ల‌క్ష‌ల మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలు చేతులు ముడుచుకోని కూర్చోరు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యాల‌యాలు కూల‌గొడుతామ‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. న‌ల్ల‌గొండ‌లో మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యాల‌యాల‌న్ని కూల్చండి అని చెప్పిండు. వ‌రంగ‌ల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాల‌యాల‌న్ని కూల్చేస్తామ‌ని.. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే రాజేంద‌ర్ రెడ్డి మీడియ సమావేశం పెట్టి ప్ర‌క‌టించారు.

రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న‌ప్పుడు వారి పార్టీకి కూడా భూ కేటాయింపులు జ‌రిగాయి. ఆ జీవోనే అనుస‌రించి బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాలు నిర్మించుకుంది. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. 60 ల‌క్ష‌ల మంది స‌భ్య‌త్వం ఉన్న బీఆర్ఎస్ భ‌వ‌నాలు కూల్చుతామంటే బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఊరుకోరు అని సుద‌ర్శ‌న్ రెడ్డి తేల్చిచెప్పారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలో వస్తుందని, అధికారం శాశ్వతం కాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పేద విద్యార్థులకు వైద్య విద్య భాసం కోసం రాష్ట్రంలో 33 జిల్లాలు చేసి ప్రతి జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీలు కట్టించారన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మార్పిడి కోసం అర్దరాత్రి 1 గంటల వరకు పని చేస్తున్నారన్నారు. కానీ ఎనిమిది మెడికల్ కాలేజీల అనుమతుల గురించి సీఎం రేవంత్ ఒక్క గంట పాటు కూడా సమీక్ష చేయడం లేదని ఆయన విమర్శించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story