అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుదాం : కేటీఆర్

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.

ktr
X

బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడం బాధకరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా.. మేము తెలంగాణ పక్షమని. మనమంతా ముక్తకంఠంతో తీర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుదామని కేటీఆర్ అసెంబ్లీలో పేర్కొన్నారు. కాజీపేట ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ కేంద్రం ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వస్తాం.. కలిసి పోరాడుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు.

భారతదేశంలో 156 మెడికల్ కళాశాలలు ఇచ్చారు. కానీ తెలంగాణకు కేంద్రం ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర విద్యాలయాలు ఇవ్వలేదు. ఒకవైపు కొట్లాడాం. మరో వైపు మనం సొంతం ఏర్పాటు చేసుకున్నాం. యాచిస్తే.. తెలంగాణ రాదు.. శాసిస్తే వస్తుంది.. అలాగే బడ్జెట్ విషయంలో జరిగిందన్నారు.బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఏపీకి డబ్బులు ఇచ్చారు సంతోషం. గిరిజన యూనివర్సిటీని పోరాటాలతోనే సాధించామన్నారు. రూ.24వేల కోట్లు కేటాయించాలని నీతి అయోగ్ చెప్పినప్పటికీ ఇవ్వలేదు. వెయ్యి గురుకుల పాఠశాలలు నిర్మించుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు

Vamshi

Vamshi

Writer
    Next Story