కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి

రెండోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు

G. Kishan reddy
X

తెలంగాణ బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్ ‌రెడ్డి ఢిల్లీలోని శాస్త్రీ భవన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకారించారు. అంతకు ముందు ఏపీ, తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏపీ భవన్‌లోని వేంకటేశ్వర స్వామి, దుర్గమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1960లో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన కిషన్‌రెడ్డి, జయప్రకాశ్‌ నారాయణ స్ఫూర్తితో జనతా పార్టీ యువ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చారు. బీజేవైఎమ్​లో అఖిల భారత కార్యదర్శిగా, జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.

2004లో హిమాయత్‌నగర్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత అంబర్‌పేట నుంచి పోటీ చేసి, హ్యాట్రిక్‌ విజయాలు సొంతం చేసుకున్నారు. బీజేపీ శాసనసభాపక్షనేతగాను పనిచేశారు. 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా అవకాశం దక్కించుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం కాషాయా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగారు. సికింద్రాబాద్ పార్లమెంట్‌ నుంచి రెండోసారి గెలుపొందారు. 2019, 2024 లోక్ సభ ఎలక్షన్‌లో విజయం సాధించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి పదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కారణంగా వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో విద్యుత్ కోతలు ఉండేవన్నారు. హైదరాబాద్ లోనూ పారిశ్రమలు విద్యుత్ కోతల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోయి, మోటార్లు కాలిపోయి అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కానీ ఈ పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ విద్యుత్ కోతలు లేని నూతన భారత దేశాన్ని ఆవిష్కరించారని చెప్పారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, పార్టీ నేతలు హాజరయ్యారు. మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోష్ కిషన్ రెడ్డి ఛాంబర్ కు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Vamshi

Vamshi

Writer
    Next Story