విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కమిషన్‌కు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి లేఖ

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి మాజీ సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉన్న కరెంట్ అవసరాల దృష్ట్యి రాష్ట్రాల మధ్య నెలకొన్న పోటీ ఉండటంతో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంతో అవగాహన ఒప్పందం చేసుకున్నామనిపేర్కొన్నారు. ఏడు మండలాలను ఆంధ్రాకు తీసుకుని సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీలో కలుపుకున్నారని తెలిపారు. 2003 కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ చట్టం ప్రకారం పీజీసీఐఎల్‌ నిబంధనలకు లోబడే ఒప్పందాలు జరిగాయన్నారు.





రాష్ట్ర అభివృద్ధికి ఇది దోహదపడిందేగానీ, ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. సింగరేణి బొగ్గు ఉండటం వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఆ ప్రతిపాద ఒప్పుకోలేదాన్నారు. భద్రాద్రి విద్యుత్‌ కేంద్రం సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మాణం విషయంలో అప్పుడు ఉన్న చట్టాలకు, నిబంధనలకు లోబడే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి చేస్తామని బీహెచ్‌ఈఎల్‌ ముందుకురావడంతో కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు, మణుగూరులో నాలుగు 270 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణం ఆ సంస్థకు అప్పగించినట్లు తెలిపారు.

అన్నదాతకు 24 గంటల కరెంట్, పెరుగుతోన్న విద్యుత్‌ డిమాండ్లను దృష్టిలో పెట్టుకొనే నల్గొండ జిల్లా దామరచర్లలో 4వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా చేసిన నిరాధార, అర్థరహిత ఆరోపణలకు చేస్తున్నరని పేర్కొన్నారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశ్యంతోనే నేను విద్యుత్ విచారణ కమీషన్ కు లేఖ రాశాన్నారు. కేసీఆర్,రమన్ సింగ్ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రులుగావిద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం జరిగిందన్నారు.ఈ మేరకు సుదీర్ఘ లేఖను జగదీశ్‌రెడ్డి జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు పంపించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story