అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులపై జగన్ ఆగ్రహం

తమ ఎమ్మెల్యేల ప్లకార్డులను లాక్కుని, చింపేసే హక్కు ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు. అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు.

ys jagan ap
X

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న తమ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అడ్డుకొని వారి చేతుల్లోని ప్లకార్డులను చింపివేశారని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులను లాక్కుని, చింపేసే హక్కు ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు. అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ముఖ్యమని చెప్పారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని అన్నారు. మరోవైపు సభ ప్రారంభం అవుతుండటంతో... నల్ల కండువాలతోనే సభలోకి వైసీపీ సభ్యులను పోలీసులు అనుమతించారు. ఇంకోవైపు, సభలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే జగన్ సభ నుంచి బయటకు వచ్చారు. అధికారం ఎప్పటికీ ఒకేలా ఉండదని గుర్తు చేశారు. పోలీసులు ఉన్నది ప్రభుత్వంలో ఉన్నవారికి సలాం కొట్టడానికి కాదు అని మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story