కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని విరమించుకోవడం విచారం : కేటీఆర్

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రతి సంవత్సరం జున్2న ఐటీ పరిశ్రమలు, మున్సిపాల్ శాఖల వార్షిక నివేదిక విడుదల చేశామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు

BRS KTR
X

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రతి సంవత్సరం జున్2న ఐటీ పరిశ్రమలు, మున్సిపాల్ శాఖల వార్షిక నివేదిక విడుదల చేశామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. ఈ నివేదికలు తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను గర్వంగా ప్రదర్శించాయిన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు తెలియజేయడమే దీని ఉద్దేశమన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సంప్రదాయన్నికి మంగళం పలికారు. 2023-24 వార్షిక నివేదికలను విడుదల చేయకపోవడం విచారకరం అని కేటీఆర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

గతంలో ఐటీ రంగంలో హైద‌రాబాద్ న‌గ‌రం శరవేగంగా దూసుకుపోయిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో రాష్ట్రాన్ని ఐటి రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నప్పుడు… అనేకమంది ఆశ్చర్యంగా చూశారని, అయినా దేశ ఐటీ రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచేందుకు తమ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందన్నారు. గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం సహాయనిరాకరణ చేసినా, ఈ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించగలిగామని ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి గా మారిందని కంపెనీలు ఇతర రాష్ట్రలకు తరలిపోతుయన్నాయి

Vamshi

Vamshi

Writer
    Next Story