లోకేశ్‌ కోసమే క్యాబినెట్‌లో యువతకు ప్రాధాన్యమా?

ఏపీ సీఎం చంద్రబాబు తన తనయుడు లోకేశ్‌ కోసమే క్యాబినెట్‌లో ఎక్కువ శాతం (సుమారు 80 శాతం) యువ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారని తెలుస్తోంది.

లోకేశ్‌ కోసమే క్యాబినెట్‌లో యువతకు ప్రాధాన్యమా?
X

ఏపీ సీఎం చంద్రబాబు తన తనయుడు లోకేశ్‌ కోసమే క్యాబినెట్‌లో ఎక్కువ శాతం ( 25 మందిలో 17 మంది యూత్‌. అంటే సుమారు 80 శాతం) యువ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారని తెలుస్తోంది. పార్టీలో ఇప్పటికే లోకేశ్‌ నంబర్‌ 2 కొనసాగుతున్నారు. బాబు కూడా ఊహించని విధంగా టీడీపీకి గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక అసెంబ్లీ వచ్చాయి. కేంద్రంలోనూ ఆయనలోనూ చంద్రబాబు మాట చెల్లుబాటయ్యే పరిస్థితులున్నాయి.ఈ సమయంలోనే తన తనయుడిని రానున్న రోజుల్లో ఉన్నతస్థానంలో నిలబెట్టడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నంలో భాగమే మంత్రివర్గ కూర్పు అంటున్నారు.

ఏపీ క్యాబినెట్‌లో చంద్రబాబు యువతకే పెద్దపీట వేశారు. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమౌతున్నది. బాబు తన తనయుడు లోకేశ్‌ను వచ్చే మూడేళ్ల తర్వాత కీలక స్థానంలో కూర్చోబెట్టిన ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినా అధికారానికి కావాల్సిన మెజారిటీ టీడీపీ ఉన్నది. సొంతంగానే 135 ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉన్నది కనుక తన మాటకు తిరుగుండదు. కూటమి ఏర్పడటంలో కీలక పాత్ర పోషించిన జనసేన 21 పోటీ చేసి అన్నిచోట్లా గెలుపొందింది. బీజేపీ కూడా 8 చోట్ల గెలిచింది. వైసీపీ అధినేత జగన్‌ అన్నట్టు రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హనీమూన్‌ నడుస్తున్నది. ఇది ఎంత కాలం కొనసాగుతుందో చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

సీనియర్లకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై వారంతా అసంతృప్తితో ఉన్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదని అంటున్నారు. అయ్యన్నపాత్రుడు ఇదే విషయంపై స్పందిస్తూ ఎన్టీఆర్ తనను 25 ఏండ్ల వయసులోనే మంత్రిని చేశారని, అప్పుడుసీనియర్లు ఎవరూ బాధపడలేదన్నారు. కనుక బాబు నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు. కొత్త వారికి అండగా ఉంటామన్నారు. మరోసీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా మంత్రివర్గ కూర్పులో 50 శాతానికి పైగా యువతకు పదవులు ఇవ్వడాన్ని స్వాగతించారు.ఇటీవల ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారని దానికి అనుగుణంగా కేబినెట్‌ కూర్పు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్న సీనియర్లకు భవిష్యత్తులో రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు.

కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలకంగా ఉండటంతో బాబు మాట చెల్లుబాటు అవ్వొచ్చు. అయితే ఇది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం. ఈలోగానే రాష్ట్రంలో వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని, రాబోయే రోజుల్లో తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకత వ్యక్తం కాకుండా చంద్రబాబు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. అయ్యన్న పాత్రుడిని అసెంబ్లీ స్పీకర్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కేబినెట్‌లో చోటు దక్కని సీనియర్ల సేవలను మరో విధంగా వినియోగించుకుంటామని ఇప్పటికే చంద్రబాబు చెప్పారు. కనుక యనమల వంటి సీనియర్ల సీఎం సలహాదారులుగా నియమించే అవకాశం లేకపోలేదు. కేంద్రంలో పరిణామాలకు అనుగుణంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Raju

Raju

Writer
    Next Story