మెడిక‌ల్ అడ్మిష‌న్లలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం : హరీశ్ రావు

కాంగ్రెస్ ప్ర‌భుత్వ అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్ల మ‌న తెలంగాణ బిడ్డ‌.. మ‌న‌కు నాన్ లోక‌ల్ అవుతున్నాడు అని రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

Harish rao12
X

వైద్య కళాశాల అడ్మిషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు సరిగా లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ సర్కార్ అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్ల మ‌న తెలంగాణ ప్రాంత బిడ్డలు నాన్ లోక‌ల్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడిక‌ల్ అడ్మిష‌న్ల విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో 33 స‌మ‌గ్రంగా లేద‌ని పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం గుడ్డెద్దు చెనేలో ప‌డ్డ‌ట్టు ఉందన్నారు. 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా మాజీ సీఎం కేసీఆర్ చేశారని గుర్తుచేశారు.

ఇదే పద్ధతిని విద్య విషయంలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రయివేటు మెడికల్ కాలేజీల్లోని లోకల్ రిజర్వేషన్లలోనూ సవరణలు చేశామని తెలిపారు. తెలంగాణ వచ్చాక ఏర్పాటు చేసిన నూతన మెడికల్ కాలేజీల్లో స్థానికేతర విద్యార్థులకు రిజర్వేషన్ అమలు చేయలేదని అన్నారు. మెడికల్ సీట్లు స్థానికులకే దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ అంశంలోనూ సరిగా అవగాహన లేదని అన్నారు. కాగా, 9వ తరగతి నుంచి 12 వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణిస్తూ గతంలోనే జీవో (నెం.114) జారీ చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా గుర్తు చేశారు. 2017 జులై 5న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ జీవో జారీ చేసిందన్నారు. ఈ జీవో నెం.114లోని 9వ తరగతి నుంచి 12 వరకు చదివిన వారిని స్థానికులుగానే పరిగణించే విధానాన్ని తాము కూడా అమలు చేస్తున్నామని, ఈ జీవోలోని నిబంధననే జీవో నెం.33లోనూ కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.

అలాగే, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒకేచోట నాలుగేళ్లు చదివిన వారికి స్థానికత కల్పించే నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. రాష్ట్ర భ‌విష్య‌త్‌ను, విద్యార్థుల భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని స‌మ‌గ్ర ఆలోచ‌న లేకుండా అడ్డ‌దిడ్డంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. నిన్న మెడిక‌ల్ ఎంబీబీఎస్ అడ్మిష‌న్ల ప్ర‌క్రియ‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చింది. మ‌న తెలంగాణ విద్యార్థుల‌కు, భ‌విష్య‌త్ త‌రాల‌కు తీర‌ని న‌ష్టం చేసే విధంగా ఆ నోటిఫికేష‌న్‌లో నిబంధ‌న‌లు ఉన్నాయి. అంటే మ‌న పిల్ల‌లే మ‌న‌కు స్థానికేత‌రులుగా మారే ప్ర‌మాదం ఉంది. క‌నీసం అధ్య‌య‌నం లేకుండా ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిష‌న్ల‌లో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కొత్త నిబంధ‌న‌లు విద్యార్థుల ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తీసే విధంగా ఉన్నాయని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story