గాంధీ ఆస్పత్రి వద్ద హైటెన్షన్..ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరో 40 మంది బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అయ్యారు.

Palla
X

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద హైటెన్షన్ చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీలో దీక్ష చేస్తున్న మోతీలాల్‌ను కలిసేందుకు పల్లా వచ్చారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం మోతీలాల్ నాయక్ వారం రోజులుగా గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయనను పరామర్శించేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వచ్చారు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

గాంధీ ఆస్పత్రికి భారీగా గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు చేరుకోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులను దాటుకొని వెళ్లి ఆస్పత్రి గేటు దూకారు. దీంతో వారిని అరెస్ట్ చేయగా ఉద్రిక్తత నెలకొంది. అనంతరం బలవంతంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరో 40 మంది బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, ఓయూ నేతల అరెస్టు అయ్యారు. పల్లాను చంద్రాయన్ గుట్ట పీఎస్‌కు, రాకేష్ రెడ్డిని బొల్లారం పీఎస్‌కు తరలించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, బల్మూరి వెంకట్‌కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story