మోతీలాల్ దీక్షతో సర్కార్‌కి సోయి వచ్చింది : ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్

తెలంగాణ ప్రభుత్వాన్నికి మోతీలాల్ దీక్షతో చలనం వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. ఆమె సెంట్రల్ యూనివర్సిటీ‌లో మోతిలాల్‌ను కలిశారు

Satyavathi rathod
X

మోతీలాల్ నాయక్ దీక్షతో సర్కార్‌కి సోయి వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం ఆమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ‌లో మోతిలాల్‌ను కలిశారు. ఆయన చేసిన దీక్ష వల్ల ప్రభుత్వంపై ఒత్తడి వచ్చిందని మోతిలాల్ ఎవరూ కలవకుండా పోలీసులు ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. ఆయనకు తండ్రి లేకపోయిన నిరుద్యోగ యువత కోసం ఆయన పోరాటం యువతకు స్ఫూర్తి నింపిందని తెలిపారు. ఆయన హెల్త్ డ్యామేజ్ అవ్వడం కిడ్నీలు ఇతర అవయవాలు దెబ్బతిన్నాయి.

అందుకే దీక్ష విరమించారని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గిరిజన బిడ్డలకు పొడు భూములు ఇవ్వడం జరిందని ఎమ్మెల్సీ సత్యవతి గుర్తుచేశారు. మాజీ సీఎం కేసీఆర్ , గురుకులలాలు ఏర్పాటు చేయడం, ఎస్టీ ఎంటర్‌ఫ్యూనర్ స్కీంలు పెట్టడం వంటివి చేశారన మోతీలాల్ గుర్తుచేశారని అన్నారు. తెలంగాణలో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఎప్పుడో దాడులు జరిగితే మంత్రులు దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మోరిగినట్టు ఉంది పరామర్శించిస్తున్నరన ఆమె అన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని, లేదంటే తిరుగుబాటు‌కు తాము, ప్రజలతో కలిసి సిద్ధంగా ఉన్నామని హెచ్చిరించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story