రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్లకు జీతాలు ఇవ్వడం లేదు : రాకేశ్ రెడ్డి

రాష్ట్రంలో మోడల్ స్కూల్ టీచర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని బీఆర్‌ఎస్ నాయకుడు రాకేశ్ రెడ్డి అన్నారు.

Rakesh reddy Anuga
X

రాష్ట్రంలో మోడల్ స్కూల్ టీచర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని బీఆర్‌ఎస్ నాయకుడు రాకేశ్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ సర్కార్ ప్రభుత్వం టీచర్లకు శాలరీలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆగస్టు 15న పెండింగ్‌లో ఉన్న వేతనలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అదనంగా టీచర్లకు ఒక నెల జీతం ఇవ్వాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చేది నెలకు 3 వేల రూపాయల లోపే ..ఆ చిన్న మొత్తం చెల్లించడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అనటం ఘోరమని రాకేష్‌రెడ్డి అన్నారు.

జూనియర్ కళాశాలల్లో ఉన్న అధ్యాపకులు, డిగ్రీ కాలేజీ గెస్ట్ లెక్చరర్లు అధ్యాపకులు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఆశా వర్కర్లు తమకు జీతం పెంచాలని ధర్నా చేశారని కాని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా జీవో 46 ను రద్దు చేసి పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రాసిన గ్రామీణ యువతకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

Vamshi

Vamshi

Writer
    Next Story