వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు.

Vamshi
X

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి వంశీ గన్నవరం వచ్చారు. ఈ క్రమంలో ఆయన వాహనాన్ని గమనించిన పోలీసులు ఆయన ఇంటి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వెంటనే గన్నవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడిచేసి నిప్పు అంటించారు. ఆయనను ఏ1 ముద్దాయిగా చేర్చారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక వంశీ హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన కొంతమంది నాయకుల నుంచి వివరణను పోలీసులు రికార్డ్ చేశారు

Vamshi

Vamshi

Writer
    Next Story