రైతుబంధు కోసం రైతాంగం ఎదురు చూస్తుంది : నిరంజన్ రెడ్డి

రైతుబంధు కోసం తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇవ్వకపోగా కనీసం నీళ్లను కూడా ఎందుకు ఎత్తిపోస్తలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

రైతుబంధు కోసం రైతాంగం ఎదురు చూస్తుంది : నిరంజన్ రెడ్డి
X

రైతుబంధు కోసం తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇవ్వకపోగా కనీసం నీళ్లను కూడా ఎందుకు ఎత్తిపోస్తలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి మీడియ సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ గత ఏడాదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఒక పంపును ప్రారంభించారని పేర్కొన్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెంలలో 3 చొప్పున పంపులు సిద్దంగా ఉన్నాయి .. దాదాపు 30 టీఎంసీల నీరు స్టోర్ చేసుకునే అవకాశం ఉందని నిరంజన్‌రెడ్డి అన్నారు.

పాలమూరు మీద కేసీఆర్ కు చిత్తశుద్ది లేదని ప్రచారం చేశారు .. అదే కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి మొదలుపెడితే కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను అడ్డుకున్నార ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎత్తిపోతల పథకం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ అన్నారు. 60 టీఎంసీల నీళ్లను 90 రోజుల్లో తెచ్చుకునే విధంగా కేసీఆర్ ఈ పథకం రూపొందించారని పాలమూరు రంగారెడ్డి పథకంలోని నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ సందర్శించలేదన్నారు. తాజా బడ్జెట్ లో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు కనీస బడ్జెట్ కేటాయించలేదని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ మీద ఆసక్తి చూపుతున్న రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టు మూలంగా ఎంత మంది జీవితాలు బాగుపడతాయిని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story