ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ టార్గెట్ చేసి వేధిస్తున్నాయి : హరీష్ రావు

అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ చేసి వేధిస్తున్నాయి. ప్రతి పక్షాలనులొంగదీసుకునేందుకే ఈడీ, ఐటీ దాడులు చేపడుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు.

harish
X

అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి వేధించడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పరామర్శించారు. నిన్న ఇంట్లో ఈడీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అక్రమ డబ్బు, బంగారం కనీసం ఏమి దొరకలేదని హారీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు.

నీట్ ప్రశ్నపత్రం లీకైతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? అధికార పక్షానికి ఒక రూల్, ప్రతిపక్షాలకు రూల్ అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించబోమని, పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పి అందుకు విరుద్ధంగా పనిచేస్తోందాన్నారు. మహిపాల్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించారని..ఇంట్లో ఉన్న పసిపిల్లలు కూడా ఏడ్చేలా ఈడీ అధికారులు వేధించారాన్నారు.న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలస్తుందని హరీష్ రావు అన్నారు.

నీట్ ప్రశ్నపత్రం లీకైతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? అని సూటిగా ప్రశ్నించారు. అధికార పక్షానికి ఒక నీతి, ప్రతిపక్షాలకు ఒకనీతినా? అని ఘాటుగా విమర్శించారు. 24 లక్షమంది విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. బిహార్, గుజరాత్‌లలో పరీక్షకు రెండురోజుల ముందు పేపర్ లీకైంది. ప్రశ్న పత్రాలను అంగట్లో సరుకులా లక్షలకు అమ్ముకుంటుంటే ఈడీ, ఐటీ ఎక్కడెకెళ్లాయన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story