ఇందిరమ్మ పాలనలో.. దండుకుంటున్న రేవంత్ కుటుంబం

సీఎం రేవంత్ అమెరికా పర్యటన సందర్భంగా స్వచ్ బయోతో వెయ్యి కోట్ల రూపాయల ఒప్పందం అని పత్రికల్లో వార్తలు వచ్చాయి అని బీఆర్‌ఎస్ నేత మన్నే క్రిశాంక్ అన్నారు.

Krishik
X

సీఎం రేవంత్ అమెరికా పర్యటన సందర్భంగా స్వచ్ బయోతో వెయ్యి కోట్ల రూపాయల ఒప్పందం అని పత్రికల్లో వార్తలు వచ్చాయి అని బీఆర్‌ఎస్ నేత మన్నే క్రిశాంక్ అన్నారు. ఆ స్వఛ్ బయో కంపెనీ రేవంత్ రెడ్డి సొంత కుటుంబానిది అని ఆరోపించారు. అసలైన కుటుంబ పాలన ,దండు పాల్యం ముఠా రేవంత్ పాలన లో చెలరేగుతున్నాయి పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో క్రిశాంక్ మాట్లాడారు. స్వచ్ బయోలో వేదవల్లి శివానంద రెడ్డి మొదటి డైరెక్టర్.. వీళ్ళు యూపీలో మెస్సే బార్ నడిపిస్తున్నారని తెలిపారు. రెండో డైరెక్టర్ ఎనుముల జగదీశ్ రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు అన్నారు. సీఎంతో ఎంఓయూ కుదుర్చుకున్నపుడు వేదవల్లి గానీ ఎనుముల జగదీశ్ లేరని తెలిపారు. హర్ష పసునూరి ఆ ఎంఓయూ సందర్భంగా సీఎం రేవంత్ ఫోటోలో ఉన్నారని పేర్కొన్నారు.

హర్ష పసునూరి ఆ ఎంఓయూ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ ఫోటోలో ఉన్నారని మండి పడ్డారు.. హర్ష పసునూరి సీఎం సోదరుడి బినామీ అన్నారు. స్వచ్ బయో కంపెనీ ఈ జూలై నెలలో ఏర్పాటైందని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ లేఖ ద్వారా తెలిసిందన్నారు. స్వచ్ బయో కంపెనీకి వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకునేంత సీన్ లేదని, సీఎం రేవంత్ రాష్ట్ర సంపదను తన సోదరులకు దోచిపెట్టే పనిలో ఉన్నారన్నారు. సీఎం 30 మంది సభ్యుల ముఠాతో అమెరికా వెళ్ళింది తన సోదరుల వ్యాపారాలు పెంచడం కోసమేనా అని ప్రశ్నించారు. స్వచ్ బయో ఒప్పందం మీద కాంగ్రెస్ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. వాల్ష్ కర్రా కంపెనీతో రూ. 830 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు.. అది కూడా ఊరు పేరు లేని కంపెనీ అన్నారు. బోగస్ కంపెనీలకు విలువైన తెలంగాణ భూములు కట్టబెట్టేందుకా రేవంత్ రెడ్డి నీకు అధికారం ఇచ్చారా అని నిలదీశారు.

నీ తమ్ముడి కంపెనీతో వ్యాపారం చేయించడానికా రేవంత్ రెడ్డి నీకు సీఎం పదవి వచ్చింది అని ప్రశ్నించారు. తమ్ముడి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సీఎం రేవంత్ అమెరికా దాకా వెళ్ళాలా అని ప్రశ్నించారు. కేటీఆర్ యూఎస్ పర్యటన సందర్భంగా ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదిరేవి.. ఇప్పుడు ఫేక్ కంపెనీలు వస్తున్నాయిని ఆవేదన వ్యక్తం చేశారు. తమా ఆరోపణలపై సీఎం రేవంత్ మౌనంగా ఉండటానికి వీలు లేదని, వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. బోగస్ కంపెనీలతో రేవంత్ ఒప్పందాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, రేవంత్ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు బోగస్ కంపెనీలని మేము నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మేము చెబుతున్నవన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉన్నవే.. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అని క్రిశాంక్ పేర్కొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story