ఆ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమించవద్దు.. గవర్నర్‌కి లేఖ : దాసోజు శ్రవణ్

కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌లను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించవద్దని దాసోజు శ్రవణ్ గవర్నర్‌కి లేఖ రాశారు.

Dasajuju Saravan
X

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వివాదం ఇంకా కొనసాగుతోంది. తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్ శర్మ బాధ్యతలు చేపట్టడంతో రేవంత్ సర్కార్ గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు సిద్దమయింది. నిన్న కోదండరాం, మీర్ అలీఖాన్‌లను సిఫారసు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే.. అయితే వెంటనే బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ , కుర్ర సత్యనారాయణలు గవర్నర్‌కు ఓ ఫిర్యాదు పంపించారు. కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌లను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించవద్దని లేఖ రాశారు.

ఎమ్మెల్సీల నియమాకం విషయమై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని అందుకే నిర్ణయం తీసుకోవద్దని లేఖలో కోరారు. గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్‌కుమార్‌, కుర్ర సత్యనారాయణలను గవర్నర్‌కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తూ అప్పటి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటి అప్పటి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కొద్ది రోజులు పరిశీలన తర్వాత వీరికి ఎమ్మెల్సీలు అయ్యే అర్హత లేదని ఫైల్ తిప్పి పంపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కోదండరాం, మీర్ అలీ ఖాన్ పేర్లను ఖరారు చేసి గవర్నర్‌కు పంపారు.

Vamshi

Vamshi

Writer
    Next Story