కాషాయ పార్టీలో విభేదాలు..అధ్యక్షుడు, ఎమ్మెల్యేలకు మధ్య కోల్డ్ వార్ !

గత కోంత కాలంగా కాషాయ పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి.. రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యేలకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది

BJP MLAS
X

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మొన్న పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మీటింగ్ హాజరుకాలేదు. కొంతకాలంగా పార్టీకి, శాసన సభ్యులు మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ రాష్ట్ర కార్యకాలయంలో రుణమాఫీ హెల్ప్ లైన్ కేంద్రాన్ని కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఒక్క ఎమ్మెల్యేకు ఆహ్వానం అందలేదు. ఈ సంఘటనపై శాసన సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ బ్యానర్లు, పోస్టర్లపై కేవలం అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫోటో తప్ప వేరే ఎమ్మెల్యేల, ఎంపీల ఫోటోలు వేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కాషాయ పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయటం లేదని తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం బీజేపీ ఎమ్మెల్యేలు మొదలుకోని పార్టీ కార్యకర్తలు మండిపడ్డాతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టడడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి ఇంకొకరికి ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. బీజేపీలోనూ ఒకే వ్యక్తికి ఒక పదవి అనే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త అధ్యక్షుడి నియామకం తప్పని పరిస్థితి. కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పుడనే విషయంపై స్పష్టత లేనప్పటికీ, అంతర్గత పోరు మాత్రం ముదురుతోంది.

పాత వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని కొందరు అంటుంటే మేము అర్హులం కాదా? అని కొత్త వాళ్లు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. నిజానికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈటల రాజేందర్‌ కాషాయతీర్థం పుచ్చుకున్నప్పటీ నుంచే పార్టీలో కొత్త, పాత పంచాయితీ నడుస్తోంది. అధిష్ఠానం సైతం దిల్లీకి పిలిపించుకుని విభేదాలు పక్కన పెట్టి పని చేయాలని చురకలు అంటించింది. విభేదాలు తగ్గకపోగా రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే స్థాయికి తీసుకువచ్చింది. అనూహ్యంగా అందరికీ అమోదయోగ్యంగా ఉండే కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. కిషన్‌రెడ్డి, బీజేపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని వాదన బలంగా వినిపిస్తున్నది.

Vamshi

Vamshi

Writer
    Next Story