హస్తం పార్టీపై మోదీ సైటైర్లు..100కు 99 కాదు 543 సీట్లలో 99 వచ్చాయి

కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం లోక్ సభలో మోడీ మాట్లాడుతూ.. 2024 లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మూడో అతిపెద్ద పరాజయం అని ఎద్దేవా చేశారు.

Pm modi
X

లోక్ సభలో విపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం లోక్ సభలో ప్రధాని మాట్లాడుతూ.. 2024 లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మూడో అతిపెద్ద పరాజయం అని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో అబద్దాలు చెప్పినా అధికారంలో రాలేకపోయారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి విమర్శించారు. వారి బాధను తాను అర్థం చేసుకోగలనని సైటైర్ వేశారు. దేశ ప్రజలంతా తమవైపు ఉన్నారు కాబట్టే మరోసారి అధికారం ఇచ్చారని మోదీ తెలిపారు. 99 లోక్ సభ సీట్లు వచ్చాయని కాంగ్రెస్ నేతలు స్వీట్లు పంచుకుంటున్నారు కానీ ఆపార్టీకి 100కు 99 సీట్లు రాలేదు.

543 సీట్లులో 99 వచ్చాయి. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క సీటు గెలవలేదన్నారు. వరుసగా మూడోసారి ఓడినా ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ క్లీన్‌స్వీప్ చేసిందని పేర్కొన్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లోనూ ప్రజల ప్రేమను చూరగొన్నామన్నారు. అనేక రాష్ట్రాల ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని.. తమ పనులు బాగున్నాయనే ఉద్దేశంతోనే ప్రజలు తమకు మూడోసారి ఛాన్స్ ఇచ్చారని చెప్పారు. ఈసారి తమ ఎన్డీఏ దక్షిణాదిలోనూ సత్తా చాటిందని అన్నారు. కేరళలో తమ పార్టీ ఖాతా తెరిచిందని, తమిళనాడులో కూడా తాము గణనీయమైన ఓట్లను సాధించామని చెప్పారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ప్రజలు సైతం తమ వెంటనే ఉన్నారన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story