తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ.. విభజన అంశాలపై ప్రధాన చర్చ

ప్రజాభవన్‌లో కొనసాగుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్నవిభజన సమస్యలపై చర్చ

Cm revanth reddy
X

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్, చంద్రబాబు ప్రజాభవన్‌లో భేటీ అయ్యారు. విభజన అంశాలపై చర్చిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరుకాగా ఏపీ మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్థన్, హాజరయ్యారు. వీరితో పాటు ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశంలో పాల్గోన్నారు. చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి స్వాగతం పలికారు. ఆయన వెంట తెలంగణ మంత్రులు కూడా చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించిన చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.



అనంతరం చంద్రబాబును తోడ్కొని రేవంత్ రెడ్డి సమావేశం జరిగే హాలులోకి వెళ్లారు. వారి వెంట ఇరు రాష్ట్రాల మంత్రులు, వివిధ శాఖల అధికారులు కూడా వెళ్లారు. ప్రస్తుతం సమావేశం ప్రారంభమైంది. ప్రజా భవన్‌కు వచ్చిన టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబును సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించి పుస్తకాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు.తెలంగాణ ప్రముఖ కవి కాళోజి రాసిన ”నా గొడవ” బుక్‌ను సీఎం రేవంత్ చంద్రబాబుకు బహుకరించారు. కాగా, నిజాంల కాలం నుండి 1980 వరకు జరిగిన పాలనతో పాటు నిజాం, బ్రిటిషర్ల పాలన మధ్య తేడాలపై కాళోజి ఈ పుస్తకంలో వివరించారు. దీంతో పాటుగా ఏళ్ల తరబడి జరిగిన తెలంగాణ ప్రజా ఉద్యమాల గురించి అనేక అంశాలను ఈ పుస్తకంలో కాళోజి ప్రస్తావించారు

Vamshi

Vamshi

Writer
    Next Story