వరంగల్‌ ప్రజలకు సీఎం రేవంత్‌ క్షమాపణలు చెప్పాలి : రాకేశ్‌రెడ్డి

కాకతీయ కళా తోరణంపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని ఓరుగల్లు ప్రజలకు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని రాకేశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Rakesh reddy
X

వరంగల్ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాకతీయ కళాతోరణాన్ని అధికారిక చిహ్నం నుండి తొలిగించడం ఓరుగల్లు ప్రజలను అవమానించడమేన్నారు. సీఎం రేవంత్ వరంగల్ పర్యటన సందర్బంగా ఏనుగుల రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. ఆయనతో సహా 40 మంది బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలను గృహ నిర్బంధించారు. రాకేష్ రెడ్డి రెండు రోజుల క్రితం తెలంగాణ భవన్ లో మీడియ సమావేశం నిర్వహించి సీఎం వరంగల్ టూర్ అడ్డుకుంటున్నారు ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించేదాక సీఎం హోదాలో ఎలా పర్యటించాలో ఆయనకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. తన ప్రెస్ మీట్ తర్వాతే సీఎం పర్యటనలో మార్పులు వచ్చాయని రాకేశ్‌ రెడ్డి అన్నారు.

కాకతీయ కళాతోరణాన్ని అధికారిక చిహ్నం నుంచి తొలగించడంపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాకతీయ కళా తోరణం రాచరిక దర్పం అన్న వ్యాఖ్యలు ఓరుగల్లు ప్రజలను తీవ్రంగా బాధించాయని ఏనుగుల రాకేశ్‌ రెడ్డి అన్నారు. కాబట్టి, సీఎం రేవంత్ రెడ్డి ఆ మాటలు వెనక్కి తీసుకొని, ఓరుగల్లు ప్రజలకు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వరంగల్ దాటేలోగా కాకతీయ తోరణం తొలగింపుపై స్పష్టత ఇవ్వాలన్నారు. లేకపోతే, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులంతా రేవంత్ రెడ్డి ఇంటిముందు టెంటు వేసుకొని ధర్నా చేయాలని సూచించారు. లేదంటే మీ క్యాంప్ ఆఫీస్‌ల ముందు ప్రజలు కుర్చుకుంటారని చెప్పారు. తెలంగాణ ప్రజలు కడుపు మీద కొట్టినా ఓర్చుకుంటాం. కానీ, మా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story