విద్యుత్ మీటర్లపై ప్రజలను సీఎం రేవంత్ ప్రక్కదారి పట్టిస్తున్నారు : జ‌గ‌దీశ్ రెడ్డి

బావుల వ‌ద్ద కరెంట్ మీట‌ర్ల విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేశార‌ని మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు.

Jagadiswar reddy
X

బావుల వ‌ద్ద మీట‌ర్ల విష‌యంలో తెలంగాణ ప్రభుత్వంపై అసెంబ్లీలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. శాస‌న‌స‌భ‌లో విద్యుత్ ప‌ద్దుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా జ‌గ‌దీశ్ రెడ్డి మాట్లాడారు. రైతుల పొలాల్లో మీటర్ల పెట్టడానికి మాజీ సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు. కేేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.30 వేల కోట్లను కూడా వదలుకున్నారమని, విద్యుత్ మీటర్లపై ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి ప్పుదోవ ప‌ట్టించారని ఆయన అన్నారు.

కేసీఆర్, మోదీ సంత‌కాలు పెట్టార‌ని కొలంబ‌స్, వాస్కోడిగామా లాగా రేవంత్ రెడ్డి ఒక ప‌త్రం ప‌ట్టుకొచ్చారు. కొన్ని ప‌దాలు డిలీట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చ‌దివారని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. కేవ‌లం ఉద‌య్ ప‌థ‌కం గురించి చెప్పారు. ఈ ప‌థ‌కంలో 27 రాష్ట్రాలు చేరాయి. ఈ ప‌థ‌కం డిస్క‌లం ఆర్థిక ప‌రిస్థితిని స‌రిదిద్ద‌డానికి తీసుకొచ్చారు. ఉద‌య్ ప‌థ‌కంలో మా కంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చేరాయి. ఆ త‌ర్వాత మేం కూడా చేరాం..2017లో ఉదయ్ స్కీంపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంతకం చేయలేదని సీఎం ప్ర‌జ‌ల‌ను, రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం రేవంత్ చేశారని హ‌రీశ్‌రావు అన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story