ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం క్రేజీవాల్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. తీహార్ జైల్లో ఉన్న తనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరో రెండు అదనపు సమావేశాలకు అనుమతి ఇవ్వాలని కేజ్రివాల్ పిటిషన్ దాఖలు చేశారు

Aravind
X

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తీహార్ జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరో రెండు అదనపు సమావేశాలకు అనుమతి ఇవ్వాలని కేజ్రివాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ డైరెక్టరేట్ కేజ్రివాల్ పిటిషన్ పై స్పందించాలని కోరింది ధర్మాసనం. ఇక కేజ్రీవాల్ పిటిషన్ పై తదుపరి విచారణ జూలై 15 కు వాయిదా వేసింది. కాగా ఢిల్లీ సీఎం కేజీవాల్ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తప్పుడు స్టేట్మెంట్ వల్ల నా భర్త జైల్లో ఉన్నారని కేజీవాల్ భార్య సునీత బాంబ్‌ ఆరోపించారు. తన భర్త రాజకీయ కుట్రకు బలి అయ్యారని ఢిల్లీ సీఎం కేజీవాల్ భార్య సునీత ఆరోపించారు. టీడీపీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. తన కొడుకు రాఘవను కాపాడుకునేందుకు శ్రీనివాసులు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అని పేర్కొన్నారు సునీత.

Vamshi

Vamshi

Writer
    Next Story