ఏపీకి కేంద్రం అండగా ఉంటుంది : శివరాజ్ సింగ్

వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల పట్ల ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమని కొనియాడారు. బాధితులకు సహాయ చర్యలు వేగంగా అందుతున్నాయని తెలిపారు.

ఏపీకి కేంద్రం అండగా ఉంటుంది : శివరాజ్ సింగ్
X

ఏపీ వరదల గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని, త్వరగా కేంద్ర ప్రభుత్వ సాయం అందేలా చూస్తానని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ హామీ ఇచ్చారు. కేంద్ర కమిటీ ఇచ్చే నివేదికను పరిశీలించాక కేంద్రం ఆర్థికసాయం ప్రకటిస్తుందని శివరాజ్ సింగ్ వెల్లడించారు. ఇటువంటి కష్ట సమయంలో రాష్ట్రానికి కేంద్రం తప్పకుండా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడ ప్రజలు ఐదు రోజుల పాటు వరద నీటిలోనే ఉండిపోయారని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమించారని కేంద్రమంత్రి కొనియాడారు. దగ్గరుండి మరీ సహాయక చర్యలు పర్యవేక్షించారని కితాబిచ్చారు.

వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చక్కగా నిర్వర్తించారని అభినందించారు. డ్రోన్ల ద్వారా ఆహారం, తాగునీరు అందించారని... పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ప్రశంసించారు. వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు వేగంగా అందిస్తున్నారని చెప్పారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబు స్వయానా వరద ప్రాంతాల్లో పర్యటించడం గొప్ప విషయమని ప్రశంసించారు. అందరం కలిసి బాధితులను గట్టెక్కించాలని అన్నారు. తాను వరద ప్రాంతాలను పరిశీలించానని శివరాజ్ సింగ్ చౌహన్ స్పష్టం చేశారు. అంతకు ముందు విజయవాడ వరద ముంపు ప్రాంతాలను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ మంత్రి లోకేశ్‌తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story