రుణమాఫీ కాలేదని రైతుల నుంచి వేల కాల్స్ వస్తున్నాయి : కిషన్‌రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. నాంపల్లి స్టేట్ ఆఫీస్‌లో రాష్ట్ర పదాధికారులు సమావేశం నిర్వహించారు

kishan reddy
X

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. నాంపల్లి స్టేట్ ఆఫీస్‌లో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. కిషన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’, స్థానిక సంస్థల ఎన్నిలకపై నేతలు చర్చించారు. బీజేపీ కార్యాలయంలో రుణమాఫీకి సంబంధించి కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశాం. దీనికి వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. రుణమాఫీ కాలేదని రైతులు ఫోన్‌ చేసి చెబుతున్నారు. రుణమాఫీ కాకపోవడంతో వారంతా ఆందోళనలో ఉన్నారు.

రుణమాఫీకి ప్రాతిపదిక ఏంటో తెలియట్లేదని రైతులు చెబుతున్నారు’’ అని అన్నారు. ప్రచారం తప్ప రుణమాఫీ జరగట్లేదని మండిపడ్డారు. బీజేపీకి 36 శాతం ప్రజలు ఓట్లు వేశారని, ప్రజల తీర్పును సవాలుగా తీసుకొని అంకితభావంతో స్థానిక సంస్థల్లో పనిచేద్దామని చెప్పారు. ఆగస్టు 15న ఎర్రకోటపై 11వ సారి ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పదాదికారుల సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మీటింగ్ హాజరుకాలేదు. పార్టీకి, శాసన సభ్యులు మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది.

Vamshi

Vamshi

Writer
    Next Story