రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాడుతుంది : పెద్ది సుదర్శన్‌ రెడ్డి

కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయంలో లొసుగులు, కుట్రలు ఉన్నాయని ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు.

Peddi sudhsharshan reddy
X

రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు బీఆర్‌ఎస్ ట్రోల్‌ఫ్రీ నెంబర్‌కి 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,562 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు. మెసేజ్‌ల రూపంలో వాట్సాప్‌లో 42,984 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్‌ సర్కార్ తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయంలో లొసుగులు, కుట్రలు ఉన్నాయని ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే అన్నారు.

రైతు రుణమాఫీ నిర్ణయం రైతుల పక్షాన కాకుండా ప్రభుత్వ పక్షాన ఉందని బీఆర్‌ఎస్‌ పార్టీ అనేకసార్లు చెప్పిందని పేర్కొన్నారు. అదే ఇప్పుడు ముమ్మాటికి నిజమైందని తెలిపారు. రుణమాఫీకి రేషన్‌ కార్డు ప్రమాణికం కాదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్పారని పెద్ది సుదర్శన్‌ రెడ్డి గుర్తుచేశారు. కానీ గ్రామస్థాయిలో పరిశీలన చేస్తే రేషన్‌ కార్డుకు ఒక్కరికే రుణమాఫీ అయినట్లు రైతుల ఫిర్యాదుల ద్వారా వెల్లడవుతుందని విమర్శించారు. దీనివల్ల లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్‌ కార్డులో చిన్న చిన్న తప్పులు ఉన్నాయని రైతు రుణమాఫీ కావడం లేదని ఫిర్యాదులు అందాయని తెలిపారు.

కొందరికి వీసా ఉందని రైతు రుణమాఫీని తిరస్కరిస్తున్నారని చెప్పారు. కొన్ని తండాల్లో అయితే భూ రికార్డులు సరిగ్గా లేవని రుణమాఫీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హయంలో రైతులకు రైతు బంధు రూపం లో 72 వేల కోట్ల రూపాయలు ,రుణమాఫీ రూపం లో మరో 30 వేల కోట్ల రూపాయలు అందించామని ఆయన అన్నారు. ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కు జరిగిన అవమానం సంపత్ చేసింది కాదని కాంగ్రెస్ సర్కారే చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరాచకలపై ఆలంపూర్‌లో త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు

Vamshi

Vamshi

Writer
    Next Story