బీజేపీతో బీఆర్ఎస్‌ విలీనం చర్చలు ఫేక్ : బండి సంజయ్

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Bandi sanjay
X

బీజేపీలో బీఆర్‌ఎస్ పార్టీ విలీనం మీడియా సృష్టే అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి అంటే తనకు గౌరవం ఉందని ఆయన సైతం నాలాగే పోరాటాలు చేసి కష్టపడి వచ్చారని బండి సంజయ్ అన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సీఎం రేవంత్ జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని కేంద్ర మంత్రి ఆరోపించారు. నాతోసహా బీజేపీ కార్యకర్తలను గత ప్రభుత్వం హింసించిన, జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేదన్నారు.ప్రధాని మోదీకి దేశం ముఖ్యం.. దేశ రక్షణ విషయంలో ఆయన రాజీ పడ్డారన్నారుు .

బీఆర్ఎస్ హయాంలో కొంతమంది అధికారులు కొమ్ము కాశారు. నిజాయితీగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదు. కాంగ్రెస్ కూడా అదే చేసింది. ఆ రెండు పార్టీలకు తేడా లేదు.. అవి ఒకటే. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్న రేవంత్ సర్కార్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంజుకుంటాం. అన్ని గ్రామపంచాయతీలకు నిధులు ఇచ్చే సత్తా కాంగ్రెస్‌కు లేదాన్నారు. నిధులు ఇచ్చేది మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే. ఏ పార్టీ అయినా సరే .. సర్పంచ్, ఎంపీటీసీలు, మాజీలు బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం ఖాయమన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలున్న మాట వాస్తవమే కదా... ఆనాడు డిప్యూటీ సీఎం మహమూద్ అలీయే రిబ్బన్ కటింగ్ చేశారు కాదని పేర్కొన్నారు.

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎన్ని వక్ప్ బోర్డు భూములను కాపాడారో సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఒకచోట ఊరు ఊరంతా వక్ఫ్ బోర్డు భూములేనని చెప్పడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి ఎంత మంది పేద ముస్లింలకు ఇచ్చారో చెప్పగలరా నిలదీశారు. ప్రైవేట్ భూములు కూడా చాలా చోట్ల వక్ఫ్ బోర్డులో ఉన్నాయి. పూర్తి విచారణ చేస్తే వివరాలు బయటకొస్తాయిన్నారు. గతంలో వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారని ఆరోపించారు. పార్టీకి, శాసనసభ్యులకు మధ్య గ్యాప్ ఉందనేది కరెక్ట్ కాదన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధక్ష మార్పు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్దా చూసుకుంటారని బండి సంజయ్ తెలిపారు.

Vamshi

Vamshi

Writer
    Next Story