రాజ్యసభ ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

సెప్టెంబర్ 3న జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న కాషాయ పార్టీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. 9 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

bjp
X

పలు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 3న జరగే రాజ్యసభ ఉప ఎన్నికలకు కమలం పార్టీ తమ అభ్యర్థలను ప్రకటించింది. 9 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. రాజస్థాన్ నుంచి కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూను, మరో కేంద్ర మంత్రి జార్జ్ కురియన్‌‌ను మధ్యప్రదేశ్ నుంచి బరిలోకి దింపినట్టు తెలిపింది. బీహార్ నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా, ఒడిశా నుంచి మాజీ బీజేడీ నేత మమతా మొహంతా, త్రిపుర నుంచి రాజీబ్ భట్టాచార్జీ పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది.

అసోం నుంచి మిషన్ రంజన్ దాస్, రామేశ్వర్ తేలి, హర్యానా నుంచి కిరణ్ చౌదరి, మహారాష్ట్ర నుంచి ధైర్యశీల్ పాటిల్ పేర్లను బీజేపీ ప్రకటించింది. కాగా ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. పలువురు నేతలు లోక్‌సభ ఎంపీలుగా గెలుపొందడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.

Vamshi

Vamshi

Writer
    Next Story