ఎన్డీఏ ప్రభుత్వంతో అదానీ, అంబానీలకే లాభం.. లోక్ సభలో రాహుల్ గాంధీ కామెంట్స్

ఎన్డీఏ ప్రభుత్వం అంబానీ, అదానీలకు మాత్రమే ప్రయోజన కలిగిస్తోందని విపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Rahul gandhi
X

లోక్ సభలో బడ్జెట్‌ సందర్బంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌తో సామాన్యులకు ఒరిగిందేమి లేదని, కేవలం అదానీ అంబానీలకే ప్రయోజనం చేకూరుతోందని విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం దేశాన్ని ఆరుగురు ప్రధాని మోదీ, అమిత్‌షా, మోహన్ భాగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ కంట్రోల్ చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. దీనిపై ఎన్డీయో భగ్గుమంది. రాహుల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్పీకర్ ఓ బిర్లా కలుగజేసుకుని సభలో లేని వారి ప్రస్తావించడం సమంజసం కాదని రాహుల్‌ని హెచ్చరించారు.

ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు స్పష్టమైన హామీ లభించలేదని ఆరోపించారు. కేంద్ర విధానాలు చూసి రైతులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు రైతు సంఘాల నేతలతో మాట్లాడేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా లేనట్లుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కరోనా లాంటి విపత్కర సమంలో పేద, మధ్య తరగతి ప్రజలంతా ప్రధాని చెప్పినట్లుగా చేశారని గుర్తు చేశారు. నేడు బడ్జెట్‌లో మళ్లీ మధ్య తరగతి వారిపై అదనపు భారాన్ని మోపారని మండిపడ్డారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో మిడిల్ క్లాస్ వాళ్లకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో నిబంధనలు సడలించి రైతులకు రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story