నీట్ నుంచి వైదొలుగుతున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేయాలి : వినోద్ కుమార్

నీట్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ విజ్ఙప్తి చేశారు.

Vinod kumar
X

నీట్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో తీర్మాణం చేయాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ విజ్ఙప్తి చేశారు. మొన్న తమిళనాడు,నిన్న పశ్చిమబెంగాల్ , ఈ రోజు కర్ణాటక రాష్ట్రాలు నీట్ నుంచి వైదొలుగుతున్నట్లు వారి వారి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలు చేశాయి గుర్తు చేశారు. నీట్ పరీక్ష వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉందని.. తెలంగాణ‌లో పీజీ సీట్లు ఎక్కువ ఉన్నందును.. నీట్ ద్వారా విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే దేశవ్యాప్తంగా లక్ష ఎంబీబీఎస్ సీట్లు ఉంటే అందులో దాదాపు 10 శాతం 8265 మంది విద్యార్థులు తెలంగాణలోనే ఉన్నారని గుర్తు చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో నీట్ పై అపనమ్మకం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. దేశంలో 706 మాత్రమే మెడికల్ కళాశాలలున్నాయని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతో తెలంగాణ లో సీట్ల సంఖ్య ఎక్కువగా పెరిగిందని, కొన్ని జిల్లాల్లో ఇంకా కళాశాలలు నిర్మాణం పూర్తయితే మరిన్ని సీట్లు పెరుగుతాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ వైద్య విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండాలంటే నీట్‌నుంచి తెలంగాణ రాష్ట్రం వైదొలగాలని ఆయన కోరారు.

Vamshi

Vamshi

Writer
    Next Story