మా భర్త ఫెయిల్యూర్ హీరో కాదు..నటి వితిక ఎమోషనల్

వరుణ్‌ సందేశ్ ఫెయిల్యూర్ హీరో కాదని. ఎలాంటి సపోర్టు లేకుండా మూవీ ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ల నుంచి ఎన్నో చిత్రాల్లో నటించారని ఆయన భార్య వితిక అన్నారు

Vithika Sheru
X

హీరో వరుణ్ సందేశ్ ఫెయిల్యూర్ యాక్టర్ అని కొందరు అనడంపై ఆయన సతీమణి నటి వితిక శేరు ఎమోషనల్ అయ్యారు. ఆయన ఫెయిల్యూర్ హీరో కాదు ఎటువంటి సపోర్టు లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లుగా మూవీస్ చేస్తున్నారు. సినిమాలు వద్దు అని పరిశ్రమ నుంచి వెళ్లిపోయిన వాళ్లను ఫెయిల్యూర్‌ యాక్టర్‌ అంటారు. వరుణ్‌ అలా చేయలేదు. ఇండస్ట్రీనే నమ్ముకున్నాడు.

ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రతీ చిత్రానికి 100 శాతం న్యాయం చేస్తాడు. ‘నింద’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని వితిక చెప్పారు. వరుణ్‌ సందేశ్‌ హీరోగా రూపొందిన సినిమా ‘నింద’. యథార్థ సంఘటనల ఆధారంగా రాజేశ్‌ జగన్నాథం దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈసందర్భంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో వరుణ్‌ సందేశ్‌ భార్య వితిక మాట్లాడుతూ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story