అమర్‌నాథ్‌ యాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు

అమర్‌నాథ్‌ యాత్రకు జమ్ముకశ్మీర్‌ సిద్ధమైంది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 19 వరకు జరగనున్న యాత్ర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

అమర్‌నాథ్‌ యాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు
X

అమర్‌నాథ్‌ యాత్రకు జమ్ముకశ్మీర్‌ సిద్ధమైంది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 19 వరకు జరగనున్న యాత్ర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వరుస ఉగ్ర దాడుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. యాత్రికులకు ఉచిత భోజనం అందించడానికి సామూహిక వంటశాలలు, వసతిగృహం, తాత్కాలిక శిబిరాల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. గత ఏడాది మంచు శివలింగాన్ని 4.5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది భక్తులు శివలింగాన్ని దర్శించుకుంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

అమర్‌నాథ్‌ యాత్ర సజావుగా సాగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్ర తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏర్పాట్లు శర వేగంగా సాగుతున్నాయి. 12 వేల అడుగుల ఎత్తులో కొలువుదీరిన మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ ఏడాది ఐదు లక్షల మంది భక్తులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి భారీ ఎత్తున సామూహిక వంట శాలలు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ వంట శాలలు యాత్రికులకు నిరంతరాయంగా ఉచితంగా ఆహారాన్ని సరఫరా చేస్తాయి. సుమారు 50 ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. రహదారులు మూసివేత, ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఇవి ఉపయోగపడనున్నాయి. యాత్రికుల తాకిడిని తట్టుకోవడానియి ఉదంపూర్‌ జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమౌతున్నది.

ప్రారంభ సూచికగా ప్రథమ పూజ

యాత్ర ప్రారంభానికి సూచికగా శనివారం ప్రథమ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా వర్చువల్‌గా పాల్గొన్నారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇటీవల జమ్ముకశ్మీర్ లో వరుస ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో యాత్రికుల భద్రత విషయంలో సిబ్బంది పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. జమ్ము, శ్రీనగర్‌ హైవే వెంట భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు సమీక్షించారు. ఉగ్ర కార్యకలాపాలను కట్టడి చేసేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ముమ్మరం చేయాలని ఆదేశించారు.

Raju

Raju

Writer
    Next Story