చిరు వ్యాపారులకు మేలు కలిగేలా నిర్ణయాలు : నిర్మలా సీతారామన్

వివిధ సంస్కరణల కోసం కేంద్రం అందిస్తున్న 50 ఏళ్ల వడ్డీరహిత రుణాలను అన్ని రాష్ట్రాలు వినియోగించుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు.

Setharaman
X

చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆమె అన్నారు. ముందస్తు బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సకాలంలో జీఎస్టీ బకాయిల చెల్లింపు, పన్నుల పంపిణీ ద్వారా రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామన్నారు.

కరోనా అనంతరం రాష్ట్రాల మూలధన వ్యయాలను పెంచే లక్ష్యంతో కేంద్రం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట వడ్డీలేని రుణాలను తీసుకువచ్చింది. 2024-2025 బడ్జెట్ రూపకల్పనపై ఆర్థికమంత్రుల సలహాలు, సూచనలను నిర్మలమ్మ తీసుకున్నారు. బడ్జెట్‌కు సంబంధించి మంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని సూచనలిచ్చామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కు అన్నారు. తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు మల్లు భట్టి విక్రమార్క ,పయ్యావుల కేశవ్ పాల్గోన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story