వైసీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ అయ్యారు. టీడీపీ కార్యాలయంలో దాడి కేసులో అప్పిరెడ్డిని గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారు.

వైసీపీ ఎమ్మెల్సీ అరెస్ట్
X

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ అయ్యారు. టీడీపీ కార్యాలయంలో దాడి కేసులో అప్పిరెడ్డిని గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతని మంగళగిరి తీసుకొస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగాం సురేష్‌ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరికొందరు వైసీపీ కీలక నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో తమకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ మరో 68 మంది నిందితులు గుంటూరు జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై ఇప్పటికే కోర్టు ఇరువర్గాల వాదనలను వినింది. విధ్వంసం ఘటనలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ తదితర వైసీపీ నేతలపై ఫిర్యాదు దాఖలైంది. వీరి కనుసన్నుల్లో వీరి అనుచరులు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని టీడీపీ ఫిర్యాదు చేసింది.

Vamshi

Vamshi

Writer
    Next Story