సెమీస్‌కు దూసుకెళ్లిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అదరగొడుతోంది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగం క్వార్టర్స్‌లో 7-5 తేడాతో లివచ్‌ ఒక్సానా (ఉక్రెయిన్‌)పై గెలిచి ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీస్‌కు దూసుకెళ్లింది

Vignesh
X

పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో భారత మహిళ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ దూకుడు కొనసాగుతుంది. క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన లివచ్ ఒక్సానాపై 7-5 తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించింది. అంతకు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌కు చెందిన సుసాకీకి వినేశ్ షాక్ ఇచ్చింది.

ఫ్రీక్వార్టర్స్‌లో ఆమెను 3-2 తేడాతో ఓడించింది. ఇవాళ రాత్రి జరిగే 10: 15 గంటలకు జరిగే సెమీ ఫైనల్‌లో యుస్నీలిస్ లోపెజ్‌ (క్యుబా)తో తలపడుతుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ మహిళా రెజ్లర్లు భారీ ఎత్తున ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ రాణించడంతో వారి పడ్డ కష్టానికి ప్రతిఫలంగా చెప్పుకోవచ్చు. యావత్తు భారత్ వినేశ్‌ని అభినందిస్తున్నారు

Vamshi

Vamshi

Writer
    Next Story