రైతు భరోసా విధి విధానాలపై వర్క్ షాప్‌లు

రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలన్న అంశంపై రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనున్నది. దీనిపై వర్క్ షాప్‌లు నిర్వహించనున్నది.

CMMR
X

రైతు భరోసా పథకం విధివిధానాల రూపకల్పనకై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ రేపటి నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసాపై ప్రభుత్వం వర్క్ షాప్‌లు నిర్వహించనున్నది. రైతులతో సమావేశమై వారిచ్చే సలహాలు, సూచనలను ఆచరణలోకి తీసుకోనున్నారు. 10న ఖమ్మం. 11,అదిలాబాద్, 12 మహబూబ్‌నగర్, 15 వరంగల్, 16 మెదక్, 18 నిజామాబాద్, 19 కరీంనగర్, 22 నల్గొండ, 23 రంగారెడ్డి ఆయా జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం వర్క్‌షాపులు నిర్వహించనున్నది.

ఈ సమావేశాలకు మేధావులు,రైతులు, రైతు సంఘాలను సమీకరించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన అభిప్రాయాలను కలెక్టర్లు వెంటనే నివేదిక రూపంలో పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. రైతు భరోసాపై మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయగా ఉప సంఘం చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ,సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు,తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు ఉన్నారు. ఈ సమావేశాలకు రైతులు, మేధావులు, రైతు సంఘాలను సమీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన అభిప్రాయాలను కలెక్టర్లు వెంటనే నివేదిక రూపంలో పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతు భరోసాపై మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Vamshi

Vamshi

Writer
    Next Story