ఆమ్రపాలి వ్యాఖ్యలు పట్ల కార్మికులు ఫైర్

ఇంటింటి చెత్త సేకరణలో పారిశుద్ద కార్మికులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి వ్యాఖ్యల పట్ల కార్మికులు భగ్గుమన్నారు

Amarapali
X

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలిపై పారిశుద్ద కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడప్పుడు స్వయంగా మా ఇంట్లో కూడా చెత్తను సేకరించడం లేదని కార్మికులపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కార్మికులు శుక్రవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టించారు. నగర నలుమూలల నుంచి భారీగా కార్యాలయానికి చేరుకున్న కార్మికులు ఆందోళన నిర్వహించారు. తాజాగా నిరసన చేస్తున్న కార్మికుల వద్దకు ఆమ్రపాలి వెళ్లి మాట్లాడారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కార్మికులకు కించపరిచే ఉద్దేశం తనకు లేదని అన్నారు. జీహెచ్‌ఎంసీలో కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. చర్చల అనంతరం కార్మికులు ఆందోళన విరమించారు. అంతకు ముందు గ్రేటర్‌లో వరద నీటి కాలువలలో వర్షపు నీరు నేరుగా పోయే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. నాలాలో అక్కడక్కడ నీటి నిలువతో దోమలు బ్రీడింగ్‌ అవకాశం ఉన్నందున వెంటనే ఆయా ప్రాంతాలలో దోమల వ్యాప్తి చెందకుండా పూడికతీత చేపట్టాలని ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story