సెక్రటేరియట్‌లో మహిళ శక్తి క్యాంటీన్లు ప్రారంభం

మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్ గా ఎదిగి దేశానికే ఆదర్శంగా నిలవాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు

Mahila sakti canteen
X

తెలంగాణ సెక్రటేరియట్‌లో మహిళ శక్తి క్యాంటీన్లను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్ గా ఎదగాలని, దేశానికే ఆదర్శంగా నిలవాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ప్రతి ఇంటి అమ్మచేతి వంటలా మహిళా శక్తి క్యాంటిన్లు నాణ్యతకు మారుపేరుగా నిలవాలన్నారు.

పల్లె రుచులు, ఇప్ప పువ్వు లడ్డులు, నన్నారి వంటి సాంప్రదాయ ఆహార పానీయాలను పట్టణాలకు పరిచయం చేయాలని అన్నారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో 151 మహిళా శక్తి క్యాంటిన్లు ఏర్పాటు చేయాలనే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. మహిళలను కోటేశ్వరులను చేయడానికి తొలి అడుగు పడిందనన్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో మహిళా శక్తి క్వాంటీన్ల ఏర్పాటు చేస్తామని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఎల్ సి తీన్మార్ మల్లన్న,ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పంచాయతిరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, తదితరులు పాల్గొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story