దేశంలో మహిళలకు భద్రత లేదు : రాబర్ట్ వాద్రా

హైదరాబాద్‌లో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పర్యటించారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడిని దర్శించుకున్నారు.

Rober vadra
X

హైదరాబాద్‌లో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పర్యటించారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక చింతనతో అనాథాశ్రమాలు, వికలాంగులను కలవడానికి, భాగ్యనగరం వచ్చినట్లు తెలిపారు. తన పర్యటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు. దేశంలో మహిళల భద్రత ప్రధాన సమస్యగా మారిందన్నారు. తన భార్య, కుమార్తె భద్రతపై ఆందోళన కలుగుతోందని చెప్పారు. మహిళలతో ఎలా ప్రవర్తించాలో ఇళ్లల్లో నేర్పించాలని సూచించారు. వయనాడ్‌ నుంచి పోటీ చేయబోతున్న తన భార్య ప్రియాంకకు శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, నేను ఒకే విషయాన్ని మాట్లాడుతున్నాం. దేశంలోని సమస్యలను నేను, రాహుల్ ఒకే కోణంలో చూస్తున్నాం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మరో ఐదేళ్ల తర్వాత ఆ మార్పు ప్రజలు చూస్తారన్నారు. రైతుల ఉద్యమంపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన మండి ఎంపీ కంగనా రనౌత్‌పై రాబర్ట్ వాద్రా విమర్శలు గుప్పించారు. ఆమె పార్లమెంట్‌లో ఉండడం సరికాదని అన్నారు. ప్రజా ప్రయోజనాల గురించి ఆమెకు ఏమైనా ఆసక్తి ఉందో లేదో ఆయన ప్రశ్నించారు. మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్న కంగనా మహిళల గురించి ఆలోచించాలని, భద్రత గురించి పోరాడాలని అన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story