జీతం తీసుకోకుండా పని చేస్తా : పవన్ కళ్యాణ్

ఏపీ పంచాయితీరాజ్ శాఖలో ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

Pavan
X

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీతం తీసుకుని పనిచేేద్దాం అనుకున్న కానీ పంచాయితీరాజ్ శాఖలో వేల కోట్ల అప్పులు చూసి జీతం వద్దని చెప్పాన్నారు. తాను ప్రజల కోసం పని చేసే మనిషనని.. అందుకే శాలరీ వద్దని చెప్పానని పవన్ అన్నారు. దేశం కోసం, నేల కోసం ఎంతటి కష్టాన్నైనా పడతానని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు సత్యకృష్ణ ఫంక్షన్ హాలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

క్యాంప్ ఆఫీసులో మరమ్మతులు ఏమైనా చేయాలా అని అడిగితే వద్దన్నా కొత్త ఫర్నీచర్ ఏమి కొనద్దు..నేను తెచ్చుకుంటా అని చెప్పా అని పవన్ వెల్లడించారు. మాజీ సీఎం జగన్ రూ.600 కోట్లతో రుషికోండలో ప్యాలెస్ కట్టారని వైసీపీ ప్రభుత్వ ఘనత అని.. తప్పుడు చేస్తే తననయినా ప్రశ్నించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టారని.. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పంపిణీ ఎక్కడ ఆగలేదని పవన్ అన్నారు

Vamshi

Vamshi

Writer
    Next Story