అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకోను: జో బైడెన్

అధ్యక్ష ఎన్నికల నుంచి తనను తప్పుకోవాలని ఎలాంటి ఒత్తిడి లేదని, తానే డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటానని జోబైడెన్‌ స్పష్టం చేశారు.

అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకోను: జో బైడెన్
X

అధ్యక్ష ఎన్నికల నుంచి తనను తప్పుకోవాలని ఎలాంటి ఒత్తిడి లేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ స్పష్టం చేశారు. నవంబర్‌ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిని అని ఆయన తేల్చి చెప్పారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిగిన చర్చల్లో బైడెన్‌ పూర్తిగా తేలిపోయారు.

దీంతో ఆయన అధ్యక్ష పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయని అమెరికన్‌ మీడియాలో ప్రచారం జరిగింది. డెమోక్రటిక్‌ పార్టీ అంతర్గతంగా ఇదే అంశంపై చర్చిస్తున్నదని ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బైడెన్‌ తాను తప్పుకోవడం లేదని తేల్చి చెప్పారు. తుదివరకు బరిలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ సాయంతో నవంబర్ లో జరిగే ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడిస్తానని పేర్కొన్నారు.

ఎన్నిసార్లు నువ్వు ఓడావు అన్నది ముఖ్యం కాదని.. ఎంత త్వరగా పుంజుకున్నావు అన్నదే ముఖ్యమని తన తండ్రి చెప్పారని బైడెన్‌ అభిమానులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Raju

Raju

Writer
    Next Story